రామాయణ మహా గ్రంధాన్ని రచించిన ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏ ఆర్ ఆఫీస్ వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రామాయణాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ రామాయణం స్ఫూర్తితో కుటుంబ మరియు మానవతా విలువలను పెంపొందించుకొని ధర్మబద్ధంగా జీవించాలని కోరారు. ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణమన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సురేష్, రమణా రెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
