జిల్లాలో ఈ పంట బుకింగ్ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలి – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

జిల్లాలో ఈ పంట బుకింగ్ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లతో వర్చువల్ గా సమావేశమై ఈ పంట బుకింగ్, సిసిఆర్సి కార్డుల జారీ, మ్యుటేషన్ కరెక్షన్ మరియు ట్రాన్స్ట్రాక్షన్స్, పట్టా సబ్ డివిజన్, రెవెన్యూ సర్వీసెస్ పై ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, హౌసింగ్ ఫర్ ఆల్ లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, ఇంటిపట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జి.ఓ ఎంఎస్ 30 రేగులరైజేషణ్, స్వామిత్వ , తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ప్రబుత్వం నిర్దేశించిన విధంగా జిల్లాలో ఈ పంట బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసారు. రెవెన్యూ సర్వీసెస్ పై ప్రజల స్పందన సంతృప్తికరంగా ఉండేలా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వారం సమీక్షించడం జరుగుచున్నదని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు అందుకనుగుణంగా పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జి.ఓ ఎంఎస్ 30 ప్రకారం రేగులరైజేషణ్ ప్రక్రియను కూడా పూర్తీ చేయాలని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ వీడియో సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పిడి మాధురి, డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, జిల్లా సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి రెవెన్యు డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *