రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలకుసీఎంచంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత నిస్తున్న దని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండలపరిషత్ సమావేశం హాలులో పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… అనుభవజ్ఞుడైన సీఎంచంద్రబాబునాయుడు తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో రా ష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాల్సిన కార్యదర్శులు బాధ్యతా..రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సర్వేలను కూడా సకాలంలో పూర్తి చేయక పోవటం వల్ల మండలం వెనుకబడగా కొత్తగా వచ్చిన ఎంపీడీవో అజిత పనితీరుతో కొంత మెరుగుపడిందన్నారు. సచివాలయాలకు సకాలంలో వచ్చి, ప్రజల అందుబాటులో వుండి ప్రభుత్వ సర్వీస్ ను వేగవంతం చేసి ప్రభుత్వానికి ప్రజల అందుబాటులో వుండి ప్రభుత్వ సర్వీస్ ను
వేగవంతం చేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. విధుల్లో అలసత్వం చూపుతూ ప్రజలను సచివాలయాల చుట్టూ తిప్పుకోక పనులు త్వరితగతిన చేయాలన్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవ హరించే వారిని ఉపేక్షించబోమన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో ప్రజాప్రతినిదులు,అధికారులు సమన్వయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం పేద వర్గాలకు అందిస్తున్న పథకాలు అర్హులకు అందించాలన్నారు. ఎంపీడీవో పి.అజిత మాట్లాడుతూ… సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు ఉదయం 10.30 గంటకు, సాయంత్రం 5 తరువాత బయోమెట్రిక్ తప్పకుండా వేయాలన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీలో కొందరు సచివాలయ ఉద్యోగులు తమ ఇష్టమైన సమయానికి వెళ్లి పంపిణీ చేశారని, ఉదయం 6 గంటలనుండే పెన్షన్ల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రభుత్వ సర్వేలు చేయటంలో ఎవరికి మినహాయింపు ఉండదన్నారు. సెలవుపై వెళ్లాలనుకునే సిబ్బందిఎంపీడివో కార్యాలయంకు తప్పనిసరిగా సమాచారంఇవ్వాల న్నారు.కొందరుఇంజనీరింగ్ అసి స్టెంట్లు జిఎస్ డబ్ల్యూ గ్రూప్ నుండి తొలగారని, వారిని తక్షణ యాడ్ చేయాలని తెలిపారు. బాధ్యతగా పని చేస్తూ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలన్నారు.
