స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహిత జిల్లా పంచాయితీ అధికారి (డీపీఓ)ను గురువారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందటం జిల్లాకే గర్వకారణమని ఎంపీపీ తాటికొండ అన్నారు. ఉత్తమ పనితీరు కనపరచి అవార్డు పొందినందుకు పలువురు ప్రజా ప్రతినిధులు డీపీఓకు అభినందనలు తెలిపారు. ఎంపీడీఓ అజిత, సిబ్బంది కూడ సన్మానించారు. కార్యక్రమంలో తాళ్లూరు సర్పంచి మేకల చార్లేన్ సర్జన్, గ్రామ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం ల పాల్గొన్నారు.
