పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చెయ్యాలని జిల్లా
పంచాయితీ అధికారి ఎం వెంకటేశ్వర రావు తెలిపారు. మండలంలోని తాళ్లూరు, శివ రామపురం ఎస్సీ కాలనీలలో ఆయన గురువారం పర్యటించారు. పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కింద స్థాయిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానంను పరిశీలించారు. వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం ప్రజల బాధ్యతగా గుర్తిం చాలని చెప్పారు. పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహిస్తే సీజనల్ వ్యాధులు ప్రబలటం తగ్గుతుందని చెప్పారు. స్వర్ణ పంచాయితీలలో ఇంటి నుండి ఇతర పన్నులను ఈ నెల చివరి కల్లా చెల్లించాలని కోరారు. రక్షిత మంచి నీటిని ప్రతి రోజు క్లోరినేషన్ చేయించాలని నచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను బట్టి ఆయా పంచాయితీలలో ఆరోగ్య సిబ్బందితో సమన్వయంతో ఉండి ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. తాళ్లూరు ఎస్సీ కాలనీలో క్లాప్ మిత్రలకు తడి పొడి చెత్తను వేరు చేయటం గురించి వివరించారు. ఎంపీడీఓ అజిత, నర్పంచి మేకల చార్లేన్ సర్జన్ గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, నచివాలయ, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

