సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి – ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగేలా చూడాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ,మందుల పంపిణీ, దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ రోజున ప్రగతి, ఎస్సి ఎస్టి అత్యాచార నిరోధ చట్టం కింద బాధితులకు పరిహారం చెల్లింపు, ఎస్సి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వాహనాలు, రెవిన్యూ సేవలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రీ అసెస్మెంట్, తదితర అంశాలపై జిల్లాలవారీగా సమీక్షించారు. కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డిఆర్ఓ బి.చిన ఓబులేసు హాజరయ్యారు. పరిసరాల శుభ్రత పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ అవసరమని సీఎస్ చెప్పారు. ప్రజలకు అందుతున్న వివిధ సేవలపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తున్నందున విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదు అని స్పష్టం చేశారు. రెవెన్యూ సర్వీసులు, దర్శన సమయాలలో దేవాలయాల్లో అందుతున్న సేవలు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల విషయంలో జరుగుతున్న రీ అసెస్మెంట్, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధితులకు పరిహార పంపిణీలో జాప్యము, నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డి సి హెచ్ ఎస్ శ్రీనివాస నాయక్, డిఆర్డిఏ పిడి నారాయణ, జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా వ్యవసాయ అధికారి ( ఇన్చార్జ్ ) రజనీకుమారి, డీఎస్ఓ పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *