ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగానికి జీ ఎస్ టి తగ్గింపుతో వినియోగదారులకు మెరుగైన సేవింగ్స్ జరుతాయని ఎసీటీఓ నుధాకర్ రావు అన్నారు. నూపర్ జీఎస్ టి – సూపర్ సేవింగ్స్ ప్రచారంలో బాగంగా తాళ్లూరులో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించటం, ఎం ఎన్ ఎంఈల, స్థానిక తయారీదారులకు, డీలర్లకు ప్రోత్సాహం ఇవ్వటం, 2వ, 3వ స్థాయి నగరాలలో డిమాండ్ పెంచటం, డిజిటల్ ఆంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగటం, ఈ సంస్కరణల ముఖ్య ఉద్దెశ్యమని ఎంపీడీఓ అజిత వివరించారు. గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, స్థానిక నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
