బన్సీలాల్ పేట్ అక్టోబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్)
బన్సీలాల్ పేట్ లో కురుమ కులస్తుల చెందిన 16 గుంటల శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురైన విషయం విదితమే.ఈ స్మశాన వాటిక స్థల విషయమై న్యాయ పోరాటం చేస్తున్నామని ,ఈ కబ్జా వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేష్ అన్నారు.శనివారం నాడు కురుమ సంఘం రాష్ట్ర నాయకులు, స్థానికులతో కలిసి ఆయన కబ్జాకు గురైన ప్రాంతం వద్ద మీడియాతో మాట్లాడారు.స్మశాన వాటికకు సంబంధించి 16 గుంటల భూమి ఉన్నట్లు గా రెవెన్యూ రికార్డులో ఉందని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు.ఇటీవల 350 గజాల స్థలంలో ఓ వ్యక్తి నిర్మాణం ప్రారంభించగా.స్మశాన వాటిక స్థలంలో నిర్మాణం ఎలా చేస్తారని స్థానిక కురువ సంఘం నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయంలో నిర్మాణదారుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు.ఇదే సాకుతో అధికారులు ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుంది.. స్పష్టమైన ఆదేశం వస్తె గాని తాము చర్యకు తీసుకోలేమని చెప్పారు.నిర్మాణమైతున్న 350 గజాల స్థలానికి మాత్రమే స్టే ఉందని మిగతా 1600 గజాల స్థలంపై ఎలాంటి స్టే లేదని… ఆ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకావాలని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అధికారులను కోరారు. ఈ విషయమై కురుమ సంఘం నాయకులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలుస్తామన్నారు.అక్రమ ధ్రువపత్రాలు సమర్పించి జిహెచ్ఎంసి నుంచి అనుమతి పొందిన విషయాన్ని కూడా తీసుకెళ్లి భవన నిర్మాణ అనుమతిని రద్దు చేపిస్తామని చెప్పారు. గతంలో స్థానిక కురుమ సంఘం నాయకులు హైడ్రా కమిషనర్‌ను, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారని చెప్పారు.ఈ స్మశాన వాటిక స్థలం స్వాధీనం చేసుకునేంతవరకు రాష్ట్రకురుమ సంఘం న్యాయపరంగా,ఆర్థికంగా స్థానిక సంఘానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు చీర శ్రీకాంత్, కుర్మ సంఘం నాయకురాలు మంత్రి కళావతి, సంతోష్, ప్రవీణ్, మంత్రి సునీల్, దినేష్,బన్సీలాల్ పేట్ డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు శివ ప్రసాద్,అరుణ్ తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

