తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామానికి చెందిన గుమ్మడి సన్నీ (23) అను యువకుడు ఈతకు వెళ్లి మృత్యు వాత కు గురైనాడు. గ్రామానికి చెందిన వికలాంగుల సంఘ నాయకుడు గుమ్మడి ముత్యాలు సుజాత దంపతులకు ఇరువురు కుమారులు. అందులో గుమ్మడి నన్నీ రెండవ కుమారుడు. సన్నీకి వివాహమై సంవత్సరం అయినది. చీమకుర్తి కి చెందిన సమీప బంధువు సుజాతతో వివాహం అయిన తర్వాత శివరామపురంలో కాపురం ఉంటున్నారు. గతంలో ఒక ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇటీవల ఎసీ మెకానిక్ గా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శనివారం వారి నమీప బంధువు వివాహం కావటంతో బంధువులు అందరూ గ్రామానికివచ్చారు. వారితో ఆనందంగా గడిపిన నన్నీ ఆదివారం వారి బంధువుల పిల్లలతో కలసి కరువది మేజర్ కాలువ కు ఈతకు వెళ్లి చేపల వేట సాగిస్తూ ఉన్నారు. ఇదే కోణంలో డ్రాప్ కు సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా నీటి సుడిలోనికి చిక్కికొని ఊపిరి ఆడక మృతి చెందాడు. దీంతో అతనితో వెళ్లిన పిల్లలు సమాచారాన్ని బంధువులకు ఇవ్వటంతో వారికి మృత దేహాన్ని ఇంటికి చేర్చారు. పెళ్లి అయి సంవత్సరం కూడ కాక పోవటంతో వారి తల్లిదండ్రుల బాధను ఓదార్చ నలవి కాలేదు. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
