ముండ్లమూరు మండలం లోని
ఉల్లగల్లు పంచాయితీ పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పెద ఉల్లగల్లు-1 అంగన్ వాడీ కేంద్రంలో గురువారం పంచాయితీ పోషణ ముగింపు మాసోత్సవం నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి రాజేశ్వరి, ఎం ఎస్ కే శిరీషలు మాట్లాడుతూ… స్థానికంగా లో కాస్ట్ నో కాస్ట్ లో దొరికే పోషకాలు ఉండే ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు ఉపయోగించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే రక్త హీనతో పాటు విటమిన్ల లోపం కూడ ఉందని చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తలు రాధ, ప్రియ, చైతన్య భారతి, సావిత్రి ప్రసన్న లక్ష్మి, వెంకట రమణ, విజయలక్ష్మి, బాలమ్మ, గాలెమ్మ ల ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసారు. పోషకాహారం ప్రాముఖ్యతను అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులకు, బాలింతలకు వివరించారు.

