రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన గురువారం వేంపాడు లో జరిగింది. వివరాల్లోకి వెళితే వేంపాడు ఎస్సీ కాలనీకి చెందిన గండి కమలాకర్ రోడ్డు ప్రక్కన నిల బడి ఉండగా అద్దంకి నుండి దర్శి వైపు వెళుతున్న గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కమలాకర్ కు కాలు చేయి విరగడంతో క్షతగాత్రుడిని ముండ్లమూరు 108 వాహనం లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు బంధువులు తెలిపారు.
వ్యక్తిని ఢీకొట్టిన కారు
16
Oct