జన గణన ప్రమాణాలను నిర్వచించటంపై డిల్లీలో పార్లమెంటు భవనంలోని కమిటీ సమావేశపు మందిరంలో శుక్రవారం ఒంగోలు ఎంపీ, గృహా మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డిల్లీ పట్టణంలో ప్రభుత్వ భూముల కేటాయింపు పై సమావేశంలో చర్చించారు. కమిటీ సభ్యులు, సహచర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.


