రాంగోపాల్ పేట అక్టోబర్ 18(జే ఎస్ డి ఎం న్యూస్)
బీసీల పాపం బీజేపీకి తప్పక తలుగుతుందని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాం లు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్ధతు తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలుపకుండా దొంగాట ఆడుతున్నదన్నారు. రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదన్నారు.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై స్టే విధించడం ద్వారా రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కావాల్సింది న్యాయమైన వాటా అని దాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సూదం, సనత్ నగర్ నియోజకవర్గం మహిళా ప్రెసిడెంట్ కమ్మర్ , అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ రాజేశ్వరి రాంగోపాల్ పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ శీలం జయ,శ్రీకాంత్ చారి,ఎంపీ సునీల్,నసీరుద్దీన్(అడ్డూ), పండు గౌడ్,రఘు ముదిరాజ్,రఘు యాదవ్,విను,కృష్ణ,జయకృష్ణ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

