బేగంపేట అక్టోబర్ 20 (జే ఎస్ డి ఎం న్యూస్) :
దీపావళి వచ్చిందంటే చాలు చిన్నపిల్లలు వారి తల్లి దండ్రులు తెచ్చిన టపాకాయలు కాలుస్తూ,స్వీట్లు తింటూ ఆనందంగా గడుపుతారు.కానీ ఎవరూ లేని అనాథలు మాత్రం వాటికి దూరంగా మిగిలి పోతారు.అయితే అలాంటి వారికి స్వీట్లు,టపాకాయలు తీసుకెళ్లి వారితో పటాకులు కాల్పించి,స్వీట్లు తినిపించి వారి కళ్లలో ఆనందం చూసి సంతోషించారు బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణమూర్తి.దీపావళి పండుగ రోజున బోయిన్ పల్లి పరిధిలో ఉన్న తెలంగాణా గార్డెన్స్ సమీపంలోని తారా హోమ్ లో అనాథలు,వీధి బాలలు ఉంటారు అన్న విషయం తెలుసుకుని బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్,అదనపు ఇన్స్పెక్టర్ లతో కలిసి అక్కడికి వెళ్ళిన ఏ సి పి వారితో సరదాగా గడిపారు.వారితో పటాకులు కాల్పించి ,స్వీట్లు పంచారు.దీంతో చిన్నారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.పోలీస్ అధికారులు తమతో పాటు దీపావళి వేడుకలలో పాల్గొనడం తో వారు ఎంతో సంతోషం తో గడిపారు. ఈ వేడుకలలో తారా హోమ్ కేర్ టేకర్ తో పాటు 50 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ సి పి గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ బాలలతో వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.



