తాళ్లూరు – రజానగరం రోడ్ లో చిన పాటి వర్షం కురిసినా నీరు నిల్వ ఉంటూ దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ప్రాంతంలో ఎట్టకేలకు అధికారులు స్పందించి తాత్కాలిక ఉమశమన దిశగా చర్యలు ప్రారంభించారు. ఆ రోడ్ లో
నిత్యం ప్రభుత్వ పాఠశాల జె బిసీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ఎబీసీ పాఠశాలకు విద్యార్థులు, మహిళలు, ప్రజలు తాళ్లూరు వైపు రాక పోకలు సాగించాలంటే నిత్యం రోడ్డుపై నీరు నిల్వ ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. సైడు కాలువలు లేక పోవటంతో ఈ దుస్థితి ఏర్పడితెలిపారు.దీంతో పరిశీలించిన ఎంపీడీఓ అజిత ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం మంగళవారం ట్రాక్టర్లతో చిన పాటి చిప్స్ ఆ రోడ్డుపై వెసారు. దీంతో రోడ్డుపై నీరు నిల్వక లేదా ఆ చిప్స్ పై నుండి రాక పోకలు సాగించటానికి కొంత అనువుగా ఉంటుంది. తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన అధికారులకు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

