పొదుపు సంఘాలు సంస్థాగత నిర్మాణాలు స్పష్టంగా ఉండాలని ఐబీ ఎపీఎం ఆదిశేషు
అన్నారు. తాళ్లూరు వెలుగు కార్యాలయంలో మంగళవారం ‘మన డబ్బులు – మన లెక్కలు ‘ గురించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు ఎం ఎం ఎన్ అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సిఆర్పి లు ఈశ్వరి, సరళ లు పాల్గొని పొదుపు సంఘాల సభ్యులకు సంస్థాగత నిర్మాణం గురించి రుణాలు పొందిన తర్వాత వాటి తిరిగి చెల్లింపు చెయ్యాల్సిన విధానం, సకాలంలో చెల్లిస్తే లభించే లబ్ధి వంటిని వివరించారు. రణాల నగదు చెల్లించినట్లయితే సంబంధిత గ్రూపు ఎంత నగదు ఇంకా చెల్లించాలి అనే అంశం కూడ వాయిన్ రూపంలో సెల్ కు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఎపీఎం దేవరాజ్, సీసీలు మోహన రావు, కోటేశ్వరరావు, అకౌంటెట్ కుమారి, ఈ -నారీలు పాల్గొన్నారు.


