రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలసి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటించారు. ముందుగా కంచర్లవారిపల్లెలో రూ. 69.85 లక్షలతో నిర్మించిన నూతన ఎస్సి హాస్టల్ మరియు హై స్కూల్లో పీఎం శ్రీ పధకం కింద రూ.69.70 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ , లైబ్రరీ, మరియు ఆట స్థలాన్ని మంత్రి డా. స్వామి ప్రారంభించారు. తరువాత కనిగిరిలో రూ. 25 లక్షలతో ఆధునీకరించిన ఎస్సి 2 హాస్టల్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం, దీపం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ వంటి అన్ని హామీలు అమలు చేశామన్నారు. మెగా డీఎస్సితో 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇక నుంచి ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సి, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి స్వామి తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వల్లే గూగుల్ రాకతో విశాఖకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి పాతుపడుతున్నారన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ విమర్శలు చేస్తోందని తెలిపారు. ప్రజలు వైసీపీ అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఎమ్మెల్యే… డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ….కనిగిరి నియోజకవర్గంలోని మహిళలు స్వయం శక్తితో ఆర్ధికంగా బలోపేతం కావాలనే మహిళలకు గత ఏడాదిగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి అనంతరం మిషన్లు అందజేస్తున్నామన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు.అనంతరం కనిగిరిలోని మోడల్ స్కూలులో మంత్రి స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సోషల్ వెల్ఫేర్ లక్ష్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





