జోరు వాన … జిల్లా వ్యాప్తంగా సరాసరి 53 మి.మీలు సరాసరి – ఒంగోలు పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించిన అధికారులు

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రాజా బాబు జిల్లాలోని అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేసారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి ప్రజలను, అధికారులకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 38 మండలాలలో వర్షపాతం సరాసరి 53 మి.మీలుగా నమోదు అయినది. పలు ప్రాంతాలలో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా కొత్త పట్నం 124.0 మి.మీ, ఒంగోలులు 107.8, ఒంగోలు రూరల్ 107.3, సీఎస్ పురం 106, వెలిగండ్ల 92, పామూరు 86.4, రాచర్ల 69.1, పొన్నలూరు
68.2, తర్లుపాడు 67.6, పొదిలి 63.5, సంతనూతల పాడు 63.5, కొనకన మిట్ట 61.2, నాగులుప్పల పాడు 58.2, పెద చెర్లో పల్లి 57.2, జరుగు మల్లి 56.5, కంభం 54.4, మర్రిపూడి 52.7, కొండేపి 51.2, కొమరోలు 49.4, అర్ధారవీడు 49.0, టంగుటూరు 47.8, గిద్దలూరు 43.5, త్రిపురాంతకం 42.8, బేస్తవారి పేట 40.7, కనిగిరి 35.6, మద్దిపాడు 35.4, హనుమంతుని పాడు 34.2, పెద్దారవీడు 33.5, దొన కొండ 31.4, దర్శి 25.9, మార్కాపురం 24.7, కురిచేడు 24.5, దోర్నాల 23.4, చీమకుర్తి 23.3, తాళ్లూరు 19.0, యర్రగొండ పాలెం 18.4, పుల్లల చెరువు 13.2, ముండ్లమూరు 13.0 మి.మీల చొప్పున నమోదు అయినది.
పలు చోట్ల అధికారులు ప్రజా ప్రతినిథులు పర్యటన…
నీట మునిగిన పలు ప్రాంతాలను మేయర్ గంగాడ సుజాత, కార్పోరేషన్ కమీషనర్ వెంకటేశ్వర రావు, అధికారులతో కలిసి నేతాజి నగర్, మధర్ ధేరిస్సా కాలనీలలో పర్యటించారు. నీటి మునిగిన నివాసాల వద్ద నీరు వెళ్లుందుకు పలు చర్యలకు అధికారులు, సిబ్బంది ఉపక్రమించారు.
జాయింట్ కలెక్టర్ అర్ గోపాల క్రిష్ణ గుత్తికొండ వారి పాలెం వద్ద ఉన్నటు వంటి ముది గొండ వాగును ప్రాంతాన్ని పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *