ఒంగోలు మంగమ్మ కాలేజి ముందు ఉన్న హైవే డివైడర్ పై జోరు వర్షంలో తడుస్తూ ఉన్న ఒ పది సంవత్సరాల అనాధ బాలుడి కూర్చిని ఉన్నాడు. పేర్నమిట్టకు చెందిన లారీ డ్రైవర్ దండే కోటేశ్వర రావు ఆ బాలుడిని గమనించాడు. దగ్గరకు తీసి కొంత సపర్యలు చేసి హెల్ప్ స్వచ్చంద సంస్థ సాగర్ కు విషయాన్ని తెలిపాడు. బాలుడి కి నూతన వస్త్రాలు వేయించి , టిఫిన్ పెట్టించి బాలుడి వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. తన పేరు పొన్నం శ్యామూల్ అని, తండ్రి పేరు అది అని, తమది వేట పాలెం అని చెప్పాడు. పూర్తి వివరాలు తెలుపక పోక పోవటంతో విషయాన్ని సీఐ విజయక్రిష్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బాలుడిని సంరక్షణ నిమిత్తం బాపట్ల జిల్లా వేటపాలెం లోని ఎయిమ్స్ బాలల సేవా హోమ్ లో ఆశ్రయం కల్పించారు.
