అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా ఉదృతంగా వర్షాలు కురిసాయి. జిల్లాలో అక్టోబర్ నెలలో సరాసరి వర్షపాతం 269.2 మి.మీలు సరాసరి 6.9 ఉండాల్సి ఉండగా ఇప్పటికే అత్యధికంగా 1393.4 మి.మీలు, సరాసరి 35.7 వర్షపాతం నమోదు అయి అదనంగా 417.2 మి.మీలు వర్షపాతం నమోదు అయినది. గత మూడు రోజులుగా సరాసరి 75.1 మి.మీలుగా నమోదు అయినది. అందులో గురువారం ఉదయం వరకు రాచర్లలో 85.4 మి.మీలు , పొదిలిలో 76.4, చీమకుర్తి 59.6, మార్కాపురంలో 57.2, పామూరు 54.6, మర్రిపూడి 50.6, సంతనూతల పాడు 49.6, చంద్రశేఖర పురం 48.6, తర్లుపాడు 48.0, ఒంగోలు రూరల్, అర్బన్‌లలో 47.4 చొప్పున, పెద్దారవీడు 40.8, కొత్త పట్నం 39.6, కొనకన మిట్ట 37.8, శింగరాయకొండ 36.8, దోర్నాల 36.4, నాగులుప్పల పాడు 34.8, కంభం, వెలిగండ్లలో 34.2 చొప్పున, బేస్తవారి పేట 34.0, కనిగిరి 33.6, పెద్ద చెర్లోపల్లి 32.4, మద్దిపాడు 32.2, టంగుటూరు 30.4, గిద్దలూరు 28.6, పొన్నలూరు 27.0, హనుమంతుని పాడు 26.6, కొమరోలు 26.4, కొండేపి 24.8, జరుగుమల్లి 24.6, దొనకొండ 23.8, పుల్లల చెరువు 20.0, దర్శి 19.2, తాళ్లూరు 19.0, అర్ధవీడు 18.4, యర్రగొండ పాలెం 16.2, త్రిపురాంతకం 13.4, ముండ్లమూరు 13.2, కురిచేడు 11.2 చొప్పున నమోదు అయినది.
పశ్చిమ ప్రకాశంలో అత్యధికంగా ……
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ ప్రకాశంలో దోర్నాల ప్రాంతంలో కర్నూల్ -గుంటూరు జాతీయ రహదారి వద్ద దొంగల వాగు పొంగి ప్రవహించటంతో వాహన రాక పోకలకు అంతరాయం కలిగాయి. యర్రగొండల పాలెం సీఐ అజయ్ కుమార్, దోర్నాల ఎస్సై మహేష్ లు రాకపోకలకు అంతరాయం లేకుండా పలు చోట్ల దారులు మల్లించి పంపారు. నాగులుప్పల పాడు మండలం చదల వాడ వద్ద రామన్న చెరువు గట్టు దెబ్బతిని చెరువులోని నీరు చీరాల- ఒంగోలు జాతీయ రహదారిపై కి వస్తుండటంతో ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాజా బాబు, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, సిబ్బంది పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నారు.
పంటలలో కూడ నీరు నిలిచి పోవటంతో పలు చోట్ల పంటలకు కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది.
వర్షాల వలన జిల్లాలో మార్కాపురం, కనిగిరి, దర్శి డివిజన్లలో 47 గ్రామాలలో, 2027 మంది రైతులకు చెందిన పత్తి 1015 ఎకరాలు, జొన్న 50 ఎకరాలు, సజ్జ 2792.5 ఎకరాలు పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు తెలిపారు.




