అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి పేర్కోన్నారు. జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని ఆలయం సమీపంలో గుంటి గంగా ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం అధ్వర్యంలో గుంటి గంగమ్మ అన్న దాన సత్రం ట్రస్టు భవన ప్రారంబోత్సవం నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావులు ముఖ్య అతిథులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న దానం కోసం దాతల దాతృత్వం సహకారంతో అన్నదాన సత్రాన్ని గుంటి గంగా భవాని ఆలయ కమిటీ చైర్మన్ గురు బ్రహ్మం, కమిటీ సభ్యులు అవిశినేని వెంగన్న, నన్నూరి శ్రీనివాస రెడ్డి, సానే ఆంజనేయులు, కొసనా శివ రామ్ ల సహకారంతో అన్నదాన సత్రాన్ని ప్రారంభించి సేవ చేయటం అభినందనీయమని అన్నారు. ముందుగా గుంటి గంగా భవాని ఆలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, నారపుశెట్టి పాపారావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈఓ వాను బాబు, ఆర్ఎ ప్రసాద్ లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజారులు కామేశ్వర శర్మ, బాల రాజు, క్రిష్ణ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, దర్శి ఎఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు,
|తాళ్లూరు, దర్శి, మండలాలు, దర్శి టౌన్ టిడిపి పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, చిన్నా, ఒంగోలు పార్లమెంటరీ నిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ ఓబులు రెడ్డి, మాజీ సర్పంచి రమణా రెడ్డి,శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర యూత్ సెక్రటరీ గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, సూరా రమణా రెడ్డి, కౌన్సిలర్ వీసీ రెడ్డి, ఉప సర్పంచ్ కాశిరెడ్డి, పిన్నిక రమేష్ , మేడగం సుబ్బా రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.




