అల్పపీడన ప్రభావంతో గత ఐదు రోజులుగా జిల్లాలో విస్తృతంగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగటం, పలు కాలనీలు నీట మునగటంతో అధికారులు అప్రమత్తమై దిద్దిబాటు చర్యలు చేపట్టారు. బేస్తవారి పేట మండలంలో గలిజేరుగుళ్ల కట్ట తెగి వర్షపు నీరు అంతా బయటకు వస్తూ చెరువు క్రింద
సాగు లో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు కొట్టుకుపోయాయి. కొండేపి నియోజక వర్గంలో కొండేపి- అనకర్ల పూడి గ్రామాల మధ్య అట్లేరు వాగు పొంగటంతో రాక పోకలు నిలిచి పోయాయి.
శుక్రవారం ఉదయం వేళ ముసురుతో పాటు చలి గాలులు వీచటంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేశాలలో జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు 1593.6 మి.మీలు సరాసరి 40.9 మి.మీల వర్షపాతం నమోదు అయినది. జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు నమోదు అయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి…. కొండేపి 126.4 మి.మీలు, శింగరాయ కొండ 114.6, కొత్త పట్నం 113.4, ఒంగోలు రూరల్, అర్బన్ లలో 80.6 చొప్పున, టంగుటూరు 72.6, జరుగు మల్లి 64.6, గిద్దలూరు 59.4, కంభం 57.2, రాచర్ల 56.6, చీమకుర్తి 49.6, పామూరు 48.8, సంత నూతల పాడు 45.6, వెలిగండ్ల 45.2, మర్రిపూడి, కొమరోలులలో 44.2 చొప్పున, పొన్నలూరు 43.2, బేస్తవారి పేట 42.6, అర్ధవీడు 40.2, హనుమంతుని పాడు 40.0, పెద చెర్లో పల్లి 38.6, పొదిలి 34.8, కనిగిరి 31.6, కొనకన మిట్ట 26.8, మార్కాపురం 20.8, పెద్దారవీడు 20.2, చంద్రశేఖర పురం 20.0, నాగులుప్పల పాడు 17.0, దొనకొండ 15.2, తర్లుపాడు 14.8, దర్శి 14.6, పుల్లల చెరువు 13.2, మద్దిపాడు 11.2, దోర్నాల 10.2, యర్రగొండపాలెం 8.8, కురిచేడు 7.4, ముండ్లమూరు 7.2, తాళ్లూరు 6.4, త్రిపురాంతకం 5.2 మి.మీల చొప్పున నమోదు అయినది.
నీట మునిగిన కాలనీలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు..
భారీ వర్షాల నేపధ్యంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ఒంగోలు అర్బన్ మండల పరిధిలోని చెరువుకొమ్ములపాలెం గ్రామంలోని న్యూ అంబేద్కర్ నగర్ కాలనీని, జగ్గ్జీవన్ రావు కాలనీని సందర్శించి చేపడుతున్న సహయక చర్యలను పరిశీలించి ప్రజలతో మాట్లాడటం జరిగింది. ఈ కాలనీలలోని సుమారు 150 ఇల్లు నీట మునగడంతో ఆ కుటుంబాల సభ్యులను దగ్గరలోని గ్రానైట్ ప్యాక్తరీకి తరలించగా, జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో వారిని సమీపంలోని నర్సింగ్ కళాశాలను తరలించి వారికి టిఫిన్, పాలు వసతి కల్పించడం జరిగింది. భోజన వసతి కూడా ఏర్పాటుచేయడం జరిగింది. నిర్వాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ వెంట నగర మేయర్ గంగాడ సుజాత, ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.



