జిల్లా కలెక్టర్ రాజాబాబు ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో కలిసారు. పార్లమెంటు పరధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో లో తట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయని, తీసుకుంటున్న సహాయక చర్యలపై చర్చించారు. త్వరిత గతిన ప్రజలకుఉపశమనం కల్పిస్తున్న విధానంపై కలెక్టర్ ఎంపీ కి వివరించారు.
ఎంపీ మాగుంటను కలిసిన పలువురు ప్రముఖలు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని శుక్రవారం పలువురు ప్రముఖులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. రవిశంకర్ గ్రూప్స్ అధినేత, జనసేన నాయకులు కంది రవిశంకర్, లాయర్ పేట సాయిబాబ మందిరం కమిటీ సభ్యులు హరినాథ్ రెడ్డి, సాయి రాజు, ఆత్మకూరి బ్రహ్మయ్య, గాంధీ శ్రీనివాస రెడ్డి కలిసి పలు విషయాలపై చర్చించారు.



