వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను వైసీపి కార్యకర్తలు ఇటీవల పలు విభాగాలలో పదవులు పొందిన నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సన్మానించి తమ కు పార్టీ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి భీమి రెడ్డి నాగమల్లేశ్వర రెడ్డి, జిల్లా బూత్ కమిటి వైస్ ప్రిసిడెంట్ కటకంశెట్టి శ్రీనివాస రావు, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూనూరి దేవదానం, మాజీ జెడ్పీటీసీ పూనూరి నాగరాజు, జిల్లా రైతు విభాగం సెక్రటరి సంగు కొండా రెడ్డి తదితరులు ఉన్నారు. వారి వెంట పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరిబాబు, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు ఉన్నారు.

