వైసీపి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 28న నియోజక వర్గ కేంద్రాలలో నిర్వహించే ప్రవేటీకరణ పోరును విజయవంతం చెయ్యాలని జిల్లా వైసీపి అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పిలుపు నిచ్చారు. జిల్లా వైసీపి కార్యాలయంలో శుక్రవారం ప్రవేటీకరణ పోరు ర్యాలీల పోస్టర్ను విడుదల కార్యక్రమం నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లితో పాటు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తులు బ్రహ్మానంద రెడ్డి, ఒంగోలు నియోజక వర్గ ఇన్చార్జి చుండూరు రవి, మాజీ ఎమ్మెల్యే కె అదేన్న, రాష్ట్ర కార్యదర్శులు కెవీ రమణా రెడ్డి, వై వెంకటేశ్వర రావు, బోట్ట రామారావు, కొత్త పట్నం ఎంపీపీ లంకపోతు అంజి రెడ్డి, పలువురు పార్టీ బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

