విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన యువకుడికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో (ఆర్టిపిషియల్ హ్యాండ్) కృత్రిమ చేయి ఏర్పాటు చేయించి అండగా నిలిచారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన సత్యాల సుమంత్ చేయి 2024 డిసెంబర్ లో
విద్యుత్ ఘాతంతో పూర్తిగా కాలిపోయింది. ఇటీవల మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసి తనకు సాయం చేయవలసిందిగా సుమంత్ అభ్యర్దించారు. మంత్రి వెంటనే మంగళగిరి రోటరీ క్లబ్ వారితో మాట్లాడి వారి సహకారంతో సుమంత్ కి కృత్రిమ చేయి (ఆర్టిపిషియల్ హ్యాండ్ ) ఏర్పాటు చేయించారు. ఈ సంధర్బంగా శుక్రవారం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసి సుమంత్ కృతజ్ఞతలు తెలిపారు.

