పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలు నిర్వాహణ

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని సివిల్, ఎ.ఆర్, స్వాట్ టీం మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి “ప్రస్తుత కాలంలో పోలీసు వ్యవస్థలో సాంకేతికత పాత్ర” అనే అంశంపై వ్యాసరచన నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో సృజనాత్మకత, ఆలోచనా శక్తిని వెలికితీయడం, మరియు ఆధునిక పోలీసింగ్ పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన పెంపొందించడం, ఆధునిక పోలీసింగ్‌లో సాంకేతికత ప్రాధాన్యతను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. పోలీసు సిబ్బంది ఈ పోటీలలో చురుకుగా పాల్గొని తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తపరిచారు . ఈ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన సిబ్బందికి జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు అందజేయబడతాయి. పోటీలను ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ లు పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణా రెడ్డి మరియు ఎఆర్ఎస్సైలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *