ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మరియు రవాణా శాఖ సంయుక్తంగా ప్రజల భద్రత మరియు ప్రయాణీకుల క్షేమం లక్ష్యంగా ఒంగోలులోని ముంగమూరు రోడ్డు, అద్దంకి బస్ స్టాండ్ మరియు టంగుటూరు టోల్ గేట్ వద్ద సుమారు 65 ప్రైవేట్ ట్రావెల్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించటం జరిగింది.
ప్రమాద సమయాల్లో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు బస్సులలో ఉన్నాయా లేదా అనే అంశంపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.
అత్యవసర సమయాల్లో సులభంగా తెరవడానికి వీలుండే అత్యవసర తలుపుల పనితీరును, అలాగే కిటికీల అద్దాలను బద్దలు కొట్టడానికి ఉపయోగించే గాజు బ్రేకర్లు ప్రతి బస్సులో అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.
లగేజ్ కంపార్ట్‌మెంట్లలో మండే పదార్థాలు లేదా చట్టవిరుద్ధ వస్తువులు ఏవైనా రవాణా అవుతున్నాయని జాగ్రత్తగా పరిశీలించారు. బస్సు యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవర్ లైసెన్స్ మరియు ఇతర అనుమతులను కూడా పరిశీలించడం జరిగింది.
అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, గడువుముగిసిన అగ్నిమాపక పరికరాలను వినియోగించరాదని మరియు వాటిని ఉపయోగించే విధానము పూర్తీ స్ధాయిలో తెలుసుకోవాలని డ్రైవర్స్ కు సూచించారు.
తనిఖీల్లోడ్రైవర్లకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఉంచుకోవాలన్నారు. అలాగే, వెంటనే ఆ లోపాలను సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో బస్సులను రోడ్లపై తిరగడానికి అనుమతించబోమన్నారు.
బస్సు బయలుదేరేముందు బస్సులో అన్ని భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని, గాజు బ్రేకర్లు, ప్రథమ చికిత్స కిట్‌లను అందరికీ కనిపించేలా, అందుబాటులో ఉంచుకోవాలని, ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు పోలీస్ అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, రవాణా శాఖ అధికారులు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు టు టౌన్ యం.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఒంగోలు ట్రాఫిక్ పాండురంగారావు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

