తాళ్లూరు మండలంలోని నీటి చెరువులను అధికారులు శనివారం పరిశీలించారు. ఎంపీడీఓ అజిత,
ఆర్డబ్యు ఎస్ సుబ్బారావు అధికారులు పరిశీలించారు. లక్కవరంలో రెండు చెరువులు, బొద్దికూరపాడు రెండు చెరువులు, మన్నేపల్లి చెరువును పరిశీలించి ఇటీవల వర్షాల వలన చెరువులోనికి వచ్చిన నీటిని ప్రస్తుతం ఉ న్న నీటి నిల్వలను పరిశీలించి చెరువు కట్ట పరిస్థితిని క్షున్నంగా పరిశీలించారు. రైతులు, గ్రామస్తులు, క్షేత్రస్థాయి అధికారులు ఎప్పటిక్పుడు పరిశీలించి ఏవైనా నీటి ఊటలు ఉంటే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాలలో ఎంపీడీఓ అజిత సచివాలయాలను పరిశీలించి సిబ్బందిని తగిన సూచనలు చేసారు. ప్రభుత్వ సర్వేలను త్వరగా పూర్తి చెయ్యాలని, ఇచ్చిన లక్ష్యాలను గడువు లోపు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. నమయపాలన పాటిస్తూ ఫెన్ అడెండెన్స్ ఇన్ టైమ్లో వెయ్యాలని కోరారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు శివరామపురం మొగలి గుండాల, తాళ్లూరు మల్లా రెడ్డి చెరువులను పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడారు. పంటను కాపాడుకోవటవటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
