నిత్యం వర్షాలు పడుతూ తాళ్లూరు – ముండ్లమూరు ప్రధాన రహదారిలో తాళ్లూరు– విఠలాపురం మధ్య గల దోర్నపు వాగు లో లెవల్ బ్రిడ్జిపై నిత్యం నీరు ప్రవహిస్తుండటంతో ప్రజల రాక పోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో విఠలాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రధాన అనుచరుడు మేడగం సుబ్బా రెడ్ది పరిస్థితిని గమనించి స్పందించాడు. ఆయన స్వంత గా ప్రొక్లయిన్ ఏర్పాటు చేయించి లో లేవల్ బ్రిడ్జికి ఆనుకుని ఉన్న మొక్కలను చప్టాల నుండి నీరు పోవటానికి అడ్డంకులను తొలగించారు. దీంతో నీరు మరి అధికంగా వచ్చిన సమయంలో మాత్రమే పైకి వస్తుంది లేదంటే నీరు లో లెవల్ బ్రిడ్జి ద్వారా వెళ్లిపోయలా మార్గం సుగమం చేసారు. న్వంత నిధులతో చప్టా వద్ద శుభ్రం చేయించి సుబ్బా రెడ్డిని పలువురు అభినందించారు.
