జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు శనివారం స్కూల్ బస్సులను తాళ్లూరు ఎస్పై మల్లికార్జున రావు తన సిబ్బందితో కలసి తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల బధ్రత, రక్షణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బస్సుల పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవర్ లైసెన్స్లు, ఫష్ట్ ఎయిడ్ బాక్స్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అంశాలను పరిశీలించారు. డ్రైవర్లకు కౌల్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు.
