సమ్మె అనంతరం పీహెచ్సీ వైద్యాధికారులు, వైద్యులు శనివారం తమ విధులను హాజరు అయ్యారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్యులు డాక్టర్ రాజేష్ యాదవ్, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక, వైద్యులు డాక్టర్ శ్రీకాంత్లు తమ విధులను హాజరు అయ్యారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి గ్రామాలో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని వైద్య సిబ్బంది ఆయా వైద్యాధికారులు ఆదేశించారు. వైద్యశాలలో పరీక్షలు చేసి అవసరమైన మందులు సిఫార్స్ చేసారు.
