హైదరాబాద్ అక్టోబర్ 29(జే ఎస్ డి ఎం న్యూస్) :
మాజీ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ,జాతీయ,అంతర్జాతీయ బార్ అసోసియేషన్ సభ్యులు భాషా నవాజ్ ఖాన్ కు అత్యంత ప్రతిష్ఠాత్మమైన అశోక పురస్కారం 2025 అవార్డ్ లభించింది. న్యూ డిల్లీ లోని చార్లెస్ వాల్టర్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా ప్రముఖ మాజీ న్యాయమూర్తి భాషా నవాజ్ ఖాన్ కు అశోక పురస్కారం 2025 అవార్డ్ ను అందజేశారు.ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పంజాబ్,హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విజయేంద్ర జైన్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి దేశం లోనే వివిధ విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.వారి సమక్షంలో భాషా నవాజ్ ఖాన్ కు అశోక పురస్కారం అవార్డ్ ను అందజేశారు.ఈ సందర్భంగా అవార్డ్ గహిత, మాజీ న్యాయమూర్తి భాషా నవాజ్ ఖాన్ మాట్లాడుతూ దక్షిణ భారత దేశం తెలంగాణా రాష్ట్రం నుంచి భారతీయ బ్యూరో క్రాట్స్ విభాగం లో తనకు అశోక పురస్కారం అవార్డ్ ను అందజేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.అంతర్జాతీయ న్యాయ నిపుణుడిగా చేసిన సేవలను గుర్తించి గతంలో తనకు న్యాయరత్న,భారత్ కిశాన్ అవార్డులను ప్రధానం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు.న్యాయ విభాగం లో తాను చేసిన విశేష కృషిని గుర్తిస్తూ గతంలో బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ లీగల్ ఎక్స్ పర్ట్ అండ్ లెజెండరీ అవార్డును కూడా అందుకున్నాను అని ఆయన స్పష్టం చేశారు.తనకు అశోక పురస్కారం ప్రధానం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.తను ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రు లకు ఈ సందర్భంగా భాషా నవాజ్ ఖాన్ హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేశారు.




