బేగంపేట అక్టోబర్ 30(జే ఎస్ డి ఎం న్యూస్) :
రక్షక భటులు రక్త దానం చేశారు.పోలీస్ అమర వీరుల వారోత్సవాలలో భాగంగా గురువారం బేగంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏ సి పి గోపాల కృష్ణమూర్తి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏ సి పి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారిని ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకు సాగాలన్నారు.యువత ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా బాధితులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.
ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ ఒక్క పిలుపుతో స్పందించి రక్తదానం చేసిన యువతను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.రక్త దానం చేసిన వారికి ఏ సి పి,ఇన్స్పెక్టర్ లు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ శిబిరంలో అడ్మిన్ ఎస్సై శ్రీధర్,శ్రవణ్ కుమార్.గౌతమి కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.


