మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ఉదృతంగా దోర్నపువాగు ప్రవహించటంతో తాళ్లూ రు-కుంకుపాడు మార్గంలోగల దోర్నపు బ్రిడ్జి పై ఏర్పడ్డ పెద్దగుంటను ఎస్సై మల్లికార్జునరావు యుద్ద ప్రాతి పదికన పూడ్పించి వాహన రాకపోకలకు ఇబ్బం దులు లేకుండా చర్యలు చేపట్టారు. వాగు ఉధృతి తగ్గడంతో బ్రిడ్జి పైనుండి మోటార్ వాహనా లపై రాకపోకలు గురువారం సాగించటం మొదలుపెట్టారు. తాళ్లూరు నుండి వెళ్లే మార్గం లో చప్టా పై 5 అడుగుల వెడల్పు, మూడు అడుగులలోతు గల పెద్ద గుంట ఏర్పడి ప్రమాధకరంగా వుండటాన్ని తెలుసుకున్న ఎస్సైమల్లి ఖార్జునరావు వెంటనే ప్రొక్లెయిన్ యజమాని మిట్టా శ్రీనుతో మాట్లాడి గుంటపూడ్చేందుకు ప్రొక్టెయిన్ ఏర్పాటు చేయించారు. నిత్యం ఆమార్గంలో గుండా పొలాలకు వెళ్లే రైతు, వైసిపి నేత కోట క్రిష్ణారెడ్డి టాక్టర్ ట్రాలీ సమకూర్చగా వాగు పక్క వున్న రాళ్ల మట్టిని ప్రొక్లెయిన్ తో ఎత్తించి ఎస్సై దగ్గరుండి గుంతనుపూడ్పించారు. ప్రమా.
దకరంగా చప్టాపై వున్న గుంతను పూడ్పించి బ్రిడ్జిపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన ఎస్సైను ప్రజలు అభినందించారు. ఈకార్యక్రమంలో ఎం పీపీతాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారంవెంకటరెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ.వెంకటే శ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి , టిడిపి రాష్ట్ర యువజన కార్యదర్శి
గొల్లపూడివేణుబాబు, సొసైటీ చైర్మన్ గొంది రమణారెడ్డి (సమర), ఎంఈవో జి.సుబ్బయ్య, డిటీ జి.ఫణీంద్ర,
ఆరై సుధీర్ కుమార్, పంచాయతీయతీ సెక్రటరీ షహనాజ్ బేగం, విఆర్వో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


