దరిశిలోని సబ్ జైలును ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ సందర్శించారు. ఖైదీలందరూ సత్ప్రవర్తన కలిగివుండాలని,వారికి అందుతున్న సదుపాయాల గురించి, ఆహార పదార్థాల నాణ్యతను,వంటకు వాడే నిత్యావసర వస్తువుల నాణ్యతకు జైలు సిబ్బందికి తగు సూచ లిచ్చి,రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఖైదీల పిర్యాదుల పెట్టెను సంపూర్ణంగా పరిశీలించి,ఖైదీలను పేరుపేరునా పలకరించి,ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్,మనోహరమ్మ, సుబ్బారెడ్డి,పారాలీగల్ వాలీంటీర్ కపురం శ్రీనివాసరెడ్డి, కోర్టు గుమాస్తా పద్మ, సబ్ జైలు ఇంచార్జి శ్రీనివాసరెడ్డి,సిబ్బంది రమణారెడ్డి,బాషా తదితరులు పాల్గొన్నారు.

