ప్రాథమికఆరోగ్య కేంద్ర రిటైర్డ్ హెల్త్ సూపర్ వైజర్ కర్నాటి వెంకటరెడ్డి(80)ఒంగోలు త్రోవ గుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. ఒంగోలు బృందావనం కన్వర్షన్ హాలుకు బంధువుల వివాహంకు ఉదయం వెళ్లాడు. మద్యాహ్నం భోజనం చేసుకుని కిమ్స్ ఆసుపత్రివైపు రోడ్డు దాటుతుండా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వెంకటరెడ్డి రోడ్డుపై పడగా తల వెనుక వైపు బల మైన గాయమై చిద్రమైంది. అక్కడున్న వారు 108 కు సమాచారం ఇవ్వగా వాహనం వచ్చే సరికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కనిగిరి ప్రాంత తమ్మినేని పాలెంకు చెందిన కర్నాటి వెంకటరెడ్డి ఉద్యోగరీత్యా దాదాపు 47 ఏళ్ల క్రితం తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్యంకు వచ్చి వివిధర కాల హోదాల్లో పనిచేసి 2004లో హెల్త్ సూపర్వైజర్ గా పదవీ విరమణ చేశాడు. ఉద్యోగసమయంలో, పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆరోగ్యం బాగోలేదని చెబితే వారిని ఆసుపత్రులకు తీసుక వెళ్లి చూపించుకుని తీసుకువస్తూ సేవలు చేసే వాడు. మృతుడు వెంకటరెడ్డి మరణంతో తాళ్లూరులో విషాదచాయలు నెల కొన్నాయి. ఉదయం అందరిని పలకరిస్తూ వెళ్లి, మద్యాహ్నం మృతి చెందాడన్నసమాచారం రావటంతో గ్రామస్తులు నిర్ఘాంత పోయారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు వున్నారు.



