బ్రాహ్మణ వాడీ వాసులకు మురుగు ముప్పు తప్పేదెప్పుడూ…!.నిత్యం మ్యాన్ హోల్స్ నుంచి బయటకు వస్తున్న మురుగు.రోడ్లను ముంచెత్తుతున్న వైనం.పాఠ శాలకు వెళ్ళే విద్యార్థులు మురుగు నీటిలో నుంచే రాకపోకలు..ఆందోళన చెందుతున్న తల్లి దండ్రులు….

బేగంపేట నవంబర్ 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
బ్రాహ్మణ వాడి బస్తీ వాసులకు మురుగు ముప్పు తప్పేదెపుడు అంటే అటు అధికారులు గానీ ఇటు ప్రజాప్రతినిధులు గానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. కారణం ఒక భవన నిర్మాణ దారుడు చేసిన పాపం బ్రాహ్మణవాడి లైన్ నెంబర్ 3.4ల పాలిట శాపం గా మారింది.రాత్రి సమయంలో భవన నిర్మాణ దారుడు తాను భవన నిర్మాణం లో ఉపయోగించిన సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ ను రాత్రి ఎవరికి తెలియ కుండా డ్రైనేజ్ లైన్ లోకి వదిలి వేయడం తో ఈ సమస్య తలెత్తింది.అప్పటి నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైంది.అంతకు ముందు సమీపంలోని కూకట్ పల్లి నాలాలో నీటి ఉదృతి పెరిగిన సమయంలో నాలా నుంచి నీరు పైపుల ద్వారా రిటర్న్ వచ్చి డ్రైనేజ్ లు పొంగేవి.అయితే ఇప్పుడు చిన్నపాటి వర్షం కురవాల్సిన పనిలేదు.నాలా లో నీటి ఉదృతి పెరగాల్సిన అవసరం లేదు.నిత్యం డ్రైనేజ్ లైన్ల నుంచి నీరు పైకి వస్తూ వీధులలో పారుతుంది.దీంతో పాఠ శాలకు వెళ్ళే చిన్నారులు,ఉదయాన్నే గుడికి వెళ్ళే మహిళలు ,వృద్ధులు మురుగు నీటిలో దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి.చిన్నారులు ప్రతి రోజు ఇలా మురుగు వ్యర్థాలలో నడుచుకుంటూ వెళుతుండటం తో వారు రోగాల భారిన పడుతున్నారని వారి తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.అలాగే ఇళ్ల ముందు మురుగు వ్యర్థాలు తీవ్ర దుర్వాసన వెదజల్లు తూ పారుతుండటంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వారంలో రెండు మూడు సార్లు శుభ్రం చేసినా మళ్ళీ అదే సమస్య….
బేగంపేట బ్రాహ్మణ వాడీ లో డ్రైనేజ్ లైన్లను వాటర్ వర్క్స్ శాఖ అధికారులు వారంలో రెండు ,మూడు సార్లు ఎయిర్ టెక్ మిషన్ తో శుభ్రం చేసినా మరుసటి రోజు సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది.గడచిన మూడు రోజుల క్రితం డ్రైనేజ్ లైన్ శుభ్రం చేసేందుకు వాటర్ వర్క్స్ శాఖ అధికారులు సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోగా స్థానికులు వారిని నిలదీశారు.తమ ప్రాంతంలో డ్రైనేజ్ నీరు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ పట్టు బట్టారు.డ్రైనేజ్ లైన్ లోకి సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ వదిలిన సంబంధిత భవన నిర్మాణ దారునిపై ఎందుకు పిర్యాదు చేయరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ సమస్య పరిష్కరించే వరకు ఎయిర్ టెక్ మిషన్ ను పోనివ్వమంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.
బ్రాహ్మణవాడి బస్తీలో ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యను ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పరిశకరించాలని వారు కోరుతున్నారు.తాము అంతా రెగ్యులర్ గా పన్నులు చెలిస్తున్నామని తమ ప్రాంతంలో ఒకరు (భవన నిర్మాణదారుడు)చేసిన పనికి తామంతా ఎందుకు ఇబ్బందులు పడాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికి చొరవ చూపక పోతే తాము సి ఎం ప్రజావాణి కి పెద్ద ఎత్తున తరలి వెళ్లి పిర్యాదు చేస్తామని బస్తీ వాసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *