తాళ్లూరు మండలంలో ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్లు 6176 మందికి గాను 5657 మందికి పంపిణీ చేసి 91.60శాతం నమోదు అయినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. పలు గ్రామాలలో టిడిపి నాయకులు నివాసాలకు అధికారులతో తిరిగి పెన్షన్లు పంపిణీ చేసారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి ,బెల్లంకొండ వారి పాలెంలో క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకటరావు పాల్గొన్నారు.
