ముండ్లమూరు మండలంలోని పెద్ద ఉల్లగల్లు పంచాయితీ పరిధిలోని లక్ష్మీ నగర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగహల్ చల్ చేశాడు. రెండు నివాసాలలో దోమతెరలు కోసి మహిళల మెడలోని బంగారం వస్తువుల కోసం దొంగతనానికి పాల్పడ్డాడు. అందులో ఒక మహిళ మెడలో ఏమీ లేకపోగా, మరో మహిళ అయినా వీరం రెడ్డి చెంచు లక్ష్మమ్మ మెడలోని మూడున్నర సవర బంగారు తాళిబొట్టు, రెండు పేటల చెయ్ ను ను లాక్కెళ్ళాడు. దీంతో మెలుకు వచ్చిన మహిళ కేకలు వేసుకుంటూ దొంగ వెంబడి పరుగులు తీసింది. అయితే దొంగ పరిగెత్తుకుంటూ సమీప పొలాల్లోకి జారుకున్నాడు. కేక లు విన్నా ఆమె భర్త ఆదిరెడ్డి, బంధువులు అన్నిచోట్ల వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో సమాచారాన్ని ముళ్ళమూరు పోలీసు లకు అందించడంతోపాటు, డయల్ 100 కు ఫోన్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు, ఇన్చార్జి ఎస్ఐ ఎస్ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అందర్నీ అలెర్ట్ చేశారు. పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. సమీపంలో ఉండే సీసీ కెమెరాలు పరిశీలించి దొంగ ఎవరన్నా విషయాన్ని నిర్ధారించేందుకు కృషి చేస్తున్నారు. బాధితురాలు చెంచు లక్షమ్మ ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో సంఘటనపై ఫిర్యాదు చేశారు.




