చంద్రబాబు పాలనను దేవుడు కూడ క్షమించడని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘటనలో 9 మంది మృతి కి సంతాపంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వైపీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కోవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు పార్టీ ఇన్చార్జి చుండూరి రవి లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో గతంలో పుష్కరాలలో, తిరుపతి, వైజాగ్, ప్రస్తుతం కాశీబుగ్గ లో భక్తులు మృతి చెందటం భక్తుల పట్ల వారి ప్రభుత్వంలో తీసుకుంటున్న అజాగ్రత్తల వలననే ఇలా జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎదో ఒక ప్రభుత్వ వైఫల్య సంఘటన జరిగిన సమయంలో డైవర్షన్ పాలిటిక్స్‌లో బాగంగా వైసీపీ నాయకుల అరెస్ట్‌లు జరుగుతున్నాయని దుయ్య బట్టారు. ఒంగోలు పార్టీ ఇన్చార్జి చుండూరి రవి మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చే సమయంలో తగిన అప్రమత్త చర్యలు తీసుకోక పోవటంతో ఇలాంటి దురదృష్ట కర సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్న వారే వైసీపీ పార్టీ వారిని మద్యం కేసులో అరెస్ట్ చేయటం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించే వారు లేకుండా ఉండేందుకే ప్రతి పక్ష పార్టీ నేతలకు లక్ష్యం చేసుకుని అక్రమకేసులలో ఇరికిస్తున్నారని అన్నారు. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అంటూ నినదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదేన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వర రావు, బొట్ల రామారావు, మాజీ ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు దుంపా రమణమ్మ, నగర అధ్యక్షుడు కటారి శంకర్, ప్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, కార్పోరేటర్లు వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



