ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది -జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున, జిల్లాలోని అధికార యంత్రాంగం కూడా అదే దృక్పథంతో వ్యవహరిస్తూ పిజిఆర్ఎస్ లో వచ్చే ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పి, రాజాబాబు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, డ్వామా, డి ఆర్ డి ఏ, మున్సిపల్ కమిషనర్ లు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షింఛి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. తొలుత పిజిఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున, జిల్లాలోని అధికార యంత్రాంగం కూడా అదే దృక్పథంతో వ్యవహరించాలన్నారు. పిజిఆర్ఎస్ కార్యక్రమానికి వస్తున్న అర్జీలలో సుమారు 70 శాతం మేర రెవెన్యూ సంబంధిత అంశాలపైనే వస్తుంటాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోపు వచ్చిన ఆర్జీల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక, వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమస్య పరిష్కారం అయిన తరవాత పరిష్కార విధానం, దరఖాస్తుదారుల సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు.
మొంధా తుఫాన్ నేపధ్యంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ శాఖలకు సంబంధించి నష్టం వివరాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా లో చేపట్టిన ఈ పంట ప్రక్రియను కూడా నిర్దేశించిన గడువులోపు పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి మరియు పురపాలక శాఖల కు సంబంధించి దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టర్స్ తదితర వివరాలను, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పంపాలని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
స్వర్ణ పంచాయతీల్లో భాగంగా గ్రామ పంచాయతీ నిర్వహించే ప్రతి ఆర్ధిక లావాదేవీలు డిజిటల్ లావాదేవీల రూపంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ఇంటి పన్నులను డిజిటల్ లావాదేవీల రూపంలో చెల్లించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలు ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల పై ఎలాంటి పిర్యాదులు రాకుండా పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలు వంద శాతం అమలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలు ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది పడరాదని, అందుకనుగుణంగా సురక్షిత త్రాగునీటి సరఫరా పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు పక్కాగా అమలు కావాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ నేపధ్యంలో మరియు వర్షా కాలం అయినందున సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, గ్రామ స్థాయిలో సీజనల్ వ్యాధులుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వైద్యాదికారులను ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డిఆర్డిఎ పిడి నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డిలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *