నవంబర్ 25 నుంచి 28 వరకు హైటెక్స్ లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025 – ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌.

హైదరాబాద్ నవంబర్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ను నవంబర్ 25 నుంచిమూడురోజులపాటు హైటెక్స్ లో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్మా మాట్లాడుతూ.వికసిత్ భారత్ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు దారితీస్తూ 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో ను వన్ నేషన్ వన్ ఎక్స్పో అనే దూరదృష్టి ఉన్న థీమ్ కింద నిర్వహిస్తున్నట్లుతెలిపారు.
నవంబర్ 25న నోవోటెల్ లో నాలెడ్జ్ డే తో ఈ ఈవెంట్ ప్రారంభమవుతుందని అన్నారు. ఇందులో 1,500కి పైగా ప్రతినిధులు, 7కు పైగా అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు,సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానం బ్రాయిలర్ మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది అని అన్నారు. మాంసం ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం 8 నుంచి 10% వృద్ధి చెందుతుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.35 లక్షల కోట్లకు పైగా తోడ్పడుతూ, పోషకాహారం, గ్రామీణాభివృద్ధి,ఉద్యోగావకాశాల పెరుగుదలకు కీలకంగా ఉందని అన్నారు. వికసిత్ భారత్ దిశగా, భారత పౌల్ట్రీ రంగం గొప్పతనాన్ని ప్రపంచానికి ప్రదర్శించాలనే సంకల్పంతో ఐపీఇఎంఏ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కు 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్స్, 40,000కుపైగా సందర్శకులు పాల్గొంటారని తెలిపారు. 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక ఎగ్జిబిషన్ స్పేస్‌లో బ్రీడింగ్, హాచరీ ఆటోమేషన్, ఫీడ్ మిల్లింగ్, వెటర్నరీ ప్రొడక్ట్స్, హౌసింగ్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వంటి తాజా ఆవిష్కరణలు ప్రదర్శించబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర హ్యాచరీస్ జీ ఎం కె. జి. ఆనంద్, శ్రీనివాసఫార్మా ఎండి చిట్టూరి సురేష్ రాయుడు, నేషనల్ ఎగ్ & చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ కె. బాలస్వామి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వి. నరసింహారెడ్డి, ఇండియన్ పౌల్ట్రీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐపీజేఏ) అధ్యక్షుడు ఎం.కె. వ్యాస్, కర్ణాటక పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ పసుపర్తి, తమిళనాడు పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగరాజ్, ఆలిండియా పౌల్ట్రీ ప్రొడక్స్ట్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి వలసన్ పి., తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రవీందర్ రెడ్డి, నెక్ హైదరాబాద్ జోన్ ఛైర్మన్ గుర్రం చంద్రశేఖరరెడ్డి, టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి వి. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *