తాళ్లూరు మండలంలో పలు దేవాలయాల్లో భక్తి శ్రర్థలతో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆలయాలు పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బొద్దికూరపాడు శ్రీ గంగా పార్వతి వర్దిణి, శివరామపురం, లక్కవరం, మాధవరం, తాళ్లూరు, గుంటి గంగా భవాని, తూర్పు గంగవరం శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసారు. సాయంత్రం బొద్దికూరపాడు, తాళ్లూరులలో లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం నిర్వహించారు. తాళ్లూరులో లింగేశ్వర స్వామి ఆలయాన్ని నబ్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి ఎ కుమార్, ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.




