జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో మంగళవారం మౌలానా అబుల్ కాలం అజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆయన జయంతిని మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారని వక్తలు అన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా రెవిన్యూ అధికారి బి సిహెచ్ ఓబులేసు, మైనార్టీ కమీషన్ మెంబర్ షేక్ కపిల్ బాష, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జె పార్ధసారధి, టిడిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి షేక్ రసూల్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కాలేషా, షేక్ అజి మున్నిషా, స్పోక్ పర్సన్ పఠాన్ కరిముల్లా ఖాన్, అజాద్ విగ్రహ కమిటి షేక్ ఇస్మాయిల్, షేక్ నాయబ్, మహాబూబ్ జాన్, ఉర్దూ కవి రపూస్, జిల్లా కాంగ్రెస్పార్టీ సెక్రటరీ షేక్ మోమిన్, షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేసారు.


