మొంథా తుఫాన్ బాధితుల సహాయార్ధం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు వారి అక్టోబర్ నెల వేతనలో ఒక రోజు వేతనాన్ని రూ.5,24,092లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడికి పీడిసీపీ బ్యాంకు చైర్ పర్సన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన రావు సమక్షంలో చెక్కును అందించారు. విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ చేయూత ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు ఉద్యోగులు ముందు ఉంటారని బ్యాకు చైర్ పర్సన్ కామేపల్లి సీతారామయ్య సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
