తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల ఆదేశాల మేరకు పనిచేస్తానని తాళ్లూరు వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. తన సతీమణి మాజీ వైస్ ఎంపీపీ ఇడమకంటి రమాదేవి, వారి అనుచరులు 30 కుటుంబాలతో కలిసి తాళ్లూరు నుండి దర్శి తరలివెళ్లారు. పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ కడియాల, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు వేసి వైఎన్ ఎంపీపీ దంపతులను, వారి అనుచరులను పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వైసీపీలో కార్యకర్తలను, నాయకులకు సముచిత స్థానం లేక పోవటంతో ఆపార్టీని వీడి, అభివృద్ధి వైపు పయనిస్తున్నారని అన్నారు.వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. తమ పెద నాన గురువా రెడ్డి కాంగ్రెస్అనంతరం వైసీపీకి దశాబ్దాలుగా పనిచేసామని తెలిపారు. ప్రస్తుతం ఆపార్టీలో తమకు సరియైన గౌరవం దక్కక పోవటంతో ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ల ఆహ్వానం మేరకు పార్టీలో చేరినట్లు, పార్టీ అభ్యున్నతికి వారి ఆదేశాల మేరకు పనిచేస్తానని చెప్పారు. అనంతరం వైస్ ఎంపీపీ ఇడమకంటి దంపతులతో పాటు, కోట సుబ్బా రెడ్డి, ఇడమకంటి వెంకట రెడ్డి, మారం నాగి రెడ్డి, యామర్తి అంజయ్య, పులి జనార్ధన్, అనపర్తి ఇస్మాయిల్ కుటుంబాలకు పార్టీ కండువా కప్పి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇంచార్జ్ రాచకొండ వెంకట రావు , సాగర్ , రామ కోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, మారం వెంకట రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
