బేగంపేట నవంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయంతో కాంగ్రెస్ పార్టీ లో చేరికలు జోరందుకున్నాయి అని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ అన్నారు.బేగంపేట డివిజన్ కు చెందిన మహిళలు సోమవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సూదం ఆధ్వర్యంలో పలువురు మహిళలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డా.కోట నీలిమ నీలిమ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా.కోట నీలిమ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోందన్నారు. వచ్చిన మెజారిటీని చూసి హైదరాబాద్ నగర కాంగ్రెస్లో ఉత్తేజం ఉరకలేస్తోందన్నారు. ఈ క్రమంలోనే పలువురు వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల్లోంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇంకోవైపు ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500లు, రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, గృహజ్యోతి పథకంతో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, యువ వికాసం కింద 5 లక్షల విద్య భరోసా కార్డు అమలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాల్ సూదం, చిరంజీవి, నసీర్ అడ్డు, రాజేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

