బేగంపేట నవంబర్ 17(జే ఎస్ డి ఎం న్యూస్) :
కార్తీక మాసం చివరి సోమవారం రోజున ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య గారు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో మహాకాళేశ్వర స్వామి కి పూజలు నిర్వహించారు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన నందీశ్వర అభిషేకం కార్యక్రమంలో శైలజ రామయ్యర్ పాల్గొన్నారు.
ఈ ఓ మనోహర్ రెడ్డి ప్రిన్సిపాల్ సెక్రటరీ కి ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులకు పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని ఈ మాసం మొత్తం మహిళలకు ప్రత్యేక అన్నారు శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మహా కాళేశ్వరం నుండి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చివరి సోమవారం రోజు కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారని వారితో కలిసి తాను కూడా కార్తీక దీపాలు వెలిగించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.ఈ సందర్భంగా ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి దంపతులు కూడా కార్తీకదీపాలు వెలిగించారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



