ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవిన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్ధసారధి, జాన్సన్, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈపిటిఎస్ వెబ్ సైట్ లో ప్రతి రోజు అప్ లోడ్ చేయాలని, ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

